Health Benefits of Flax Seeds : అవిసె గింజల అద్భుత ప్రయోజనాలు ..

అవిసె గింజల అద్భుత ప్రయోజనాలు ..

అవిసె గింజల్లో  ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అరుదుగా లభిస్తాయి.  ఇతర అత్యవసర పోషకాలు కూడా లభిస్తాయి. అవిసె గింజల్లో మనకు కావాల్సినంత ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్, ఒమేగా-3 ఫ్యాట్టీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన చర్మం, జుట్టుతోపాటూ ఇతర శరీర భాగాలకు ఎంతో మేలు చేస్తాయి.
  1. అవిసె గింజల్లో నీటిలో కరిగే, కరగని... రెండు రకాల ఫైబర్స్ ఉంటాయి. అవి మన పెద్ద పేగు పాడవకుండా కాపాడతాయి. కొవ్వు కరిగిస్తాయి. చక్కెర నిల్వలను తగ్గిస్తాయి.
  2. అవిసె గింజల్లో ఆరోగ్య కర ఫ్యాట్స్, ఫైబర్ (పీచు పదార్థం) ఉంటాయి. అవి మనకు ఎక్కువ సేపు ఆకలి వెయ్యకుండా చేస్తాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునేవాళ్లు అవిసె గింజలు తినాలి. కడుపులో మంటల్ని కూడా ఇవి తగ్గిస్తాయి.
  3. తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాకపోయినా, మలబద్ధకం సమస్య ఉన్నా... అవిసె గింజలు తినాలి. వాటిలోని పోషకాలు... జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఆకలి తగ్గిస్తాయి.
  4. జుట్టు చిట్లిపోయే సమస్యకు చెక్ పెట్టడమే కాకుండా... జుట్టు పొడవుగా, బలంగా ఉండాలంటే... అవిసె గింజల్ని తినాలి.
  5. చర్మంపై దద్దుర్లు, దురదలు, వాపులు, నొప్పులు, కందిపోవడం వంటివి పోవాలంటే, అవిసె గింజలు తినాలి. ఇలాంటి సమస్యల్ని అవిసె గింజలు త్వరగా పోగొడతాయి.

Comments

  1. Thanks for this wonderful post.
    http://www.s9express.com/

    ReplyDelete

Post a Comment