అవిసె గింజల అద్భుత ప్రయోజనాలు ..
అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అరుదుగా లభిస్తాయి. ఇతర అత్యవసర పోషకాలు కూడా లభిస్తాయి. అవిసె గింజల్లో మనకు కావాల్సినంత ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్, ఒమేగా-3 ఫ్యాట్టీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన చర్మం, జుట్టుతోపాటూ ఇతర శరీర భాగాలకు ఎంతో మేలు చేస్తాయి.

- అవిసె గింజల్లో నీటిలో కరిగే, కరగని... రెండు రకాల ఫైబర్స్ ఉంటాయి. అవి మన పెద్ద పేగు పాడవకుండా కాపాడతాయి. కొవ్వు కరిగిస్తాయి. చక్కెర నిల్వలను తగ్గిస్తాయి.
- అవిసె గింజల్లో ఆరోగ్య కర ఫ్యాట్స్, ఫైబర్ (పీచు పదార్థం) ఉంటాయి. అవి మనకు ఎక్కువ సేపు ఆకలి వెయ్యకుండా చేస్తాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునేవాళ్లు అవిసె గింజలు తినాలి. కడుపులో మంటల్ని కూడా ఇవి తగ్గిస్తాయి.
- తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాకపోయినా, మలబద్ధకం సమస్య ఉన్నా... అవిసె గింజలు తినాలి. వాటిలోని పోషకాలు... జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఆకలి తగ్గిస్తాయి.
- జుట్టు చిట్లిపోయే సమస్యకు చెక్ పెట్టడమే కాకుండా... జుట్టు పొడవుగా, బలంగా ఉండాలంటే... అవిసె గింజల్ని తినాలి.
- చర్మంపై దద్దుర్లు, దురదలు, వాపులు, నొప్పులు, కందిపోవడం వంటివి పోవాలంటే, అవిసె గింజలు తినాలి. ఇలాంటి సమస్యల్ని అవిసె గింజలు త్వరగా పోగొడతాయి.

Thanks for this wonderful post.
ReplyDeletehttp://www.s9express.com/