
శృంగారం మానసిక ఉల్లాసంతో పాటు ఒత్తిడిలను దూరం చేస్తుందని పలు పరిశోధనల్లో తేలింది. రాత్రి సమయంలోనే శృంగారం చేయడానికి ఎక్కువగా కేటాయిస్తుంటారు. శృంగారం రాత్రి సమయంలో చేయడం వలన అలసట తగ్గిపోయి సుఖమైన నిద్రపడుతుందని భావిస్తారు. రాత్రి సమయంలో శృంగారం చేస్తే ఎన్ని లాభాలు ఉన్నాయో.. తెల్లవారుజామున చేసే శృంగారం వలన అంతకంటే రెట్టింపు లాభాలు ఉంటాయంటున్నారు నిపుణులు..

ఉదయం లేవగానే మొదటగా శృంగారం చేస్తే ఆరోజంతా మానసికంగా యాక్టివ్‌గా ఉంటారు. ఉదయం శృంగారం చేస్తే శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. ఇది శరీరంలోని మానసిక ఒత్తిడిని తగ్గించి రోజంతా ప్రశాంతంగా ఉండేలా చేస్తుందని.. అదేవిధంగా డయాబెటిస్ వచ్చే ముప్పు చాలా వరకు తగ్గిపోతుందన్నారు. ఉదయం పూట శృంగారం వలన దాదాపుగా 300కేలరీల శక్తి ఖర్చు అవుతుంది. దీంతో డయాబెటిస్, ఊబకాయం వంటి వాటి నుంచి సహజంగా బయటపడొచ్చని నిపుణులు పేర్కోన్నారు.
Comments
Post a Comment