జీడిపప్పులు ఎలా పెరుగుతాయో మీకు తెలుసా...

జీడిపప్పులు ఎలా పెరుగుతాయో మీకు తెలుసా...



ఈ రోజుల్లో ప్రపంచ దేశాలన్నీ జీడిపప్పును వాడుతున్నాయి. స్వీట్లు, హాట్లు, వంటలు అన్నింటిలోనూ జీడిపప్పు వేస్తున్నారు. జీడిపప్పు చెట్టు... ఉష్ణమండల ప్రదేశాల్లో పెరుగుతుంది. ఈ చెట్టుకు జీడి పువ్వు వచ్చాక... దాని నుంచీ జీడి యాపిల్ కాస్తుంది. అది కాస్త తియ్యగా, కాస్త వగరుగా ఉంటుంది. యాపిల్ పెద్దది అవుతున్నప్పుడే... దాని కింద జీడి పప్పు కాస్తుంది. అది కూడా పెరిగి పెద్దదవుతుంది. ఇలా జీడిపప్పు పూర్తిగా పెద్దది అయిన సమయంలో... జీడి యాపిల్ చక్కటి రంగులో... చక్కటి టేస్టుతో పెద్ద పరిమాణానికి చేరుతుంది. ఆ సమయంలో... జీడిపప్పును... జీడి యాపిల్‌తో సహా చెట్టు నుంచీ కట్ చేస్తారు. జీడి యాపిల్‌ను ఫ్రూట్ డ్రింక్ లేదా లిక్కర్ తయారీలో వాడతారు. జీడిపప్పును వేరు చేసి... అమ్ముతారు.


i was today years old when i learned that this is how cashews grow.
View image on Twitter


22K people are talking about this

Comments