టీ కంటే డికాక్షన్ బెటర్
మీరు రోజుకు మూడు నాలుగు టీలు తాగుతారా... అయితే మీరు మీ టీలో స్వల్ప మార్పులు చేసుకుంటే... ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఎందుకంటే పాలు కలిపిన టీ తాగేవారి కంటే... పాలు కలపకుండా... టీ-నీరు (టీ డికాక్షన్ - decoction) తాగేవారి బ్రెయిన్ బాగా పనిచేస్తుందనీ, ఎక్కువగా తేనీరు తాగుతున్నవారి బ్రెయిన్‌లో అంశాల్ని గ్రహించే శక్తి బాగా పెరుగుతోందని పరిశోధనలో తేలింది. మనందరం పాలు కలిపిన టీనే ఇష్టపడి తాగుతాం. ఎందుకంటే పాలు కలపకపోతే... డికాక్షన్ కాస్త చేదుగా ఉంటుంది. అది మనకు నచ్చదు. కానీ... అదే మన బ్రెయిన్‌కి మంచిదంటున్నారు శాస్త్రవేత్తలు. టీ తాగేవారి కంటే తరచూ తేనీరు తాగేవారిలో అవగాహన, గ్రాహణ శక్తి ఆరోగ్యకరంగా ఉంటుందని వాళ్లు చెబుతున్నారు.

Comments
Post a Comment